టాబ్‌లో మెనూ చూసి, టచ్‌ స్ర్కీన్‌ మీద ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడతను. కిచెన్‌లో ఫ్లాష్‌ అయింది ఆర్డర్‌. అది చూసి ఫుడ్‌ ప్రిపేర్‌ చేయసాగారు అనిల్‌, ఈనేష్‌లు. అతనితో కూర్చున్నామె చుట్టూ ఆసక్తిగా చూస్తోంది. సీట్లన్నీ నిండిపోయిరష్‌గా వుంది అంతా. ఫుడ్‌ వచ్చింది. తెచ్చింది మనిషి కాదు, మనుషుల్ని తప్పుకుంటూ వచ్చిన రోబో. ఇది చూసిథ్రిల్లయ్యారిద్దరూ, ఏదో మాయా ప్రపంచంలో వున్నట్టు...

చెన్నైలో రోబో రెస్టారెంట్‌ బాగా పాపులరైంది. దేశంలోనే ఇది మొదటిది. నాలుగు రోబోలు వెయిటర్స్‌గా పనిచేస్తున్నాయి. ఇద్దరు టెక్కీలు రెండు కోట్లు పెట్టి ప్రారంభించారు. థాయ్‌, చైనీస్‌ ఫుడ్‌ మాత్రమే వడ్డిస్తారు. అనిల్‌, ఈనేష్‌లు కుక్స్‌గా పనిచేస్తున్నారు.అనిల్‌కి ఇరవై తొమ్మిదేళ్ళు, ఈనేష్‌కి పదిహేడు.ఫ ఫ ఫఆమె సెక్షన్‌ 100లో పని చేసుకుంటోంది. ఇంతలో సెక్షన్‌ 130 లోంచి సడి చెయ్యకుండా రాసాగింది రోబో. చూసి ఆమె భయంతో తప్పుకునే లోపు, స్టీలు కడ్డీతో ఆమె తల బద్దలైపోయింది. రోబో కొట్టిన దెబ్బకి నిట్ట నిలువునా కుప్పకూలింది. కార్మికులు పరుగెత్తుకొచ్చారు. జరిగింది చూసి దిమ్మెరబోయారు. రోబోని నిర్వీర్యం చేసేశారు ఇంజనీర్లు. తీవ్ర అలజడి రేగి కారు విడి భాగాల ఫ్యాక్టరీ ఆగిపోయింది.మరణించిన 57 ఏళ్ల అమందా బ్రూక్స్‌ భర్త విలియం, మిచిగాన్‌ కోర్టులో రోబో కంపెనీమీద కేసేశాడు.

అమెరికాలో ఇలాటిది ఇది 26వకేసు.ఫ ఫ ఫఅక్కడ అతి నైపుణ్యంగా వెల్డింగ్‌ చేస్తోంది రోబో. 22 ఏళ్ల టెక్నీషియన్‌ దాని పక్కకొచ్చాడు. అంతే, అతణ్ణి పట్టి లాగేసి స్టీలు ప్లేటు కింద నొక్కి చంపేసింది. జర్మనీ కార్ల ఫ్యాక్టరీలో తీవ్ర కలకలం రేగింది. పూర్తి స్థాయి ఆటోమేటెడ్‌ కార్ల తయారీ ఫ్యాక్టరీలో అన్నీ రోబోలే పనిచేస్తున్నాయి. ఫ్యాక్టరీ మానవ నియం త్రణలో లేదు. టెక్నీషియన్‌ అక్కడికెందుకెళ్లాడో అంతు పట్టలేదు. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు.ఫ ఫ ఫహుటాహుటిన అతణ్ణి హాస్పిటల్‌కి తరలించసాగారు. రక్తమోడుతూ కొనవూపిరితో ఉన్నాడతను. దారిలోనే ప్రాణాలు విడిచాడు. ఏడాదిన్నర క్రితమే కార్ల విడిభాగాల ఫ్యాక్టరీలో చేరాడు 24 ఏళ్ల రాంజీ లాల్‌. ఫ్యాక్టరీలో 39 రోబోలు పని చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో నెలకొల్పిన ఈ ఫ్యాక్టరీలో, ఇంకో 69 మంది టెక్నీషియన్లూ కార్మికులూ షిఫ్ట్‌లో వున్నారా పూట.