రాత్రి పది గంటల సమయంహఠాత్తుగా మొదలైన వర్షం ఉరుములు మెరుపులతో క్షణక్షణానికి త్రీవంగా కురవసాగింది.వీధిలో జనసంచారమే లేదు.చుట్టుకమ్ముకున్న చీకట్లో వర్షపు జల్లుల శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. ఎక్కడో దూరంగా వర్షపు ఉద్వేగానికి భయపడ్డ కుక్కపిల్ల వణికిపోతూ కుంయ్ కుంయ్మని ఏడుస్తోంది.అతను ఆమెవైపు కాంక్షగా చూస్తూ అడుగులు వేస్తున్నాడు.
ఆమె జింక పిల్లలా వణికిపోసాగింది.అతను ఆమె మీదికి దూసుకుపోయి ఆమెను పట్టుకున్నాడు.ఆమె అతడి చేతులనుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ – ‘‘దుర్మార్గుడా, అంతగా కావాలంటే మధుబాల దగ్గరికి పో’’ అంది ఈసడింపుగా.ఆ మాటలు వినగానే అతను మండిపడ్డాడు. ఆమెను తోసి గదిలో అటుఇటు చూశాడు.ఓ మూలలో కాయగారలు కోసే కత్తి కంటపడింది.పరుగున వెళ్ళి కత్తి అందుకున్నాడు.భయంతో ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి.ఆమెను కత్తితో ఆమె మీది లంఘించాడు. ఎడాపెడా ఆమె పొట్టలో కత్తితో నాలుగైదు సార్లు పొడిచాడు.బాధతో ఆమె వేసిన కేకలు బయటి ఉరుముల వర్షపు శబ్దాలలో కలిసిపోయాయి. కొద్ది క్షణాల పాటు గిలగిలా తన్నుకున్న ఆమె చివరికి నిస్సహాయంగా నేలవాలింది.ఆమె చుట్టూ రక్తం మడుగు కట్టింది.
బ్రజ్భూషణ్ ఇంట్లో దొంగతనం జరిగిందని, దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే నగలతో కొత్త కోడలు పుష్ప ఇల్లు విడిచి రాత్రికి రాత్రే పారిపోయిందని ఆ వీధిలో కరెంటులా పాకింది.వార్త తెలిసిన ఇరుగుపొరుగు వాళ్ళు ఆశ్చర్యపోయారు.కొత్తగా కాపురానికి వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయి బయటికిరానేలేదు. ఆమెను చూసిన వాళ్ళు ఆ వీధిలో ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు.ఆమె కాపురానికి వచ్చిన రోజు నుంచి బయటికి రానేలేదు.
కనీసం భర్త వెంట సినిమాకు పోలేదు.కనీసం ఇరుగుపొరుగు వారితోపాటు దేవస్థానానికి పోలేదు. ఆసోహా పోలీస్స్టేషన్లో ఆ సమయంలో ఇన్స్పెక్టర్ సింగ్ డ్యూటీలో ఉన్నాడు.ఆయన తన ఎదుట ఉన్న ఫైలును దీక్షగా పరిశీలిస్తున్నాడు.సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తివచ్చి ‘తన పేరు రమేశ్ అని, తన సోదరుడు మహేశ్ భార్య లక్ష రూపాయలు విలువచేసే నగలతో ఇంటి నుండి పారిపోయిందని రిపోర్ట్ రాయించాడు.ఇన్స్పెక్టర్ సింగ్ అతడిని ప్రశ్నించి రిపోర్ట్ రాసుకుని త్వరలో ఆమెను పట్టుకుంటామని చెప్పి అతడిని పంపేశాడు.