‘హాయ్...’’‘‘హాయ్ సునీల్... హౌఆర్యూ...’’‘‘ఫైన్... థాంక్యూ... నిన్న మీరు అప్డేట్ చేసిన ఫోటో బాగుంది. యువర్ లిప్స్ ఆర్ సో సెక్సీ...’’‘‘రియల్లీ... యూ నాటీ...’’డేటింగ్ యాప్‌లో చాటింగ్ రొమాంటిగ్గా సాగుతూనే ఉంది. అలకలు, చిలక పలుకులు, కోపాలు, తాపాలు... అప్పుడప్పుడు సెక్సీ కామెంట్స్... సునీల్‌కు యమా ఎగ్జయిటింగ్‌గా ఉంది.డేటింగ్ యాప్స్‌లో తరచూ అందమైన అమ్మాయిల ఫొటోల్ని చూసే సునీల్‌కు ఈ కొత్త అమ్మాయి వారం క్రితం పరిచయమైంది. తొలిసారి ఆ అమ్మాయి ప్రొఫైల్ పిక్ చూడగానే ఆమె అందానికి ఫిదా అయ్యాడు. వయస్సు పాతిక లోపే. హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉంటానంది. ఇంకేం ... హాయ్... హలో పలకరింపుల నుంచి ఆన్లైన్ ముద్దుల వరకు వెళ్లింది వ్యవహారం. ప్రతీ రోజూ ఆన్లైన్లోనే బోల్డన్ని కవ్వింపులు, కబుర్లు దొర్లిపోతున్నాయి.
ఒకరోజు...‘‘రేయ్... చిన్న హెల్ప్ కావాల్రా...’’‘‘ఏమిటో చెప్పు బంగారం...’’‘‘నా ఫేవరెట్ స్టార్ కొత్త సినిమా వచ్చింది. టికెట్లు దొరకడం లేదు...’’‘‘అయితే మనిద్దరం వెళ్దామంటావా...?’’‘‘అది కాదురా... నేను నా ఫ్రెండ్స్‌తో వెళ్తున్నా...’’‘‘ఓకే...’’‘‘కోపమొచ్చిందా...’’‘‘అదేం లేదులే కానీ విషయమేంటో చెప్పు బంగారం...’’‘‘నా డెబిట్ కార్డు పిన్ బ్లాక్ అయ్యింది. అందుకే అర్జెంటుగా నాలుగు టికెట్లు ఆన్లైన్లో బుక్‌చేసి, నాకు ఎస్సెమ్మెస్ చేయవా?’’‘‘అలాగే డార్లింగ్...’’‘‘థాంక్యూ రా... లవ్ యూ...’ అంటూ ఒక కిస్ సింబల్ పోస్ట్ చేసింది.అది చూసిన మరుక్షణమే ఆన్లైన్లో నాలుగు టికెట్లు బుక్ చేసి ఆ వివరాలను ఎస్సెమ్మెస్ చేశాడు సునీల్.ఫఫఫ‘‘సార్ నా పేరు సునీల్... ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్లీజ్... నా పేరు బయటకు రాకుండా సాయం చేయండి’’ అంటూ సైబర్ క్రైమ్ పోలీసులను బతిమిలాడటం మొదలెట్టాడు సునీల్.
‘‘అసలేం జరిగిందో చెప్పండి... ఎందుకింత కంగారుపడుతున్నారు?’’ అంటూ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రియాజ్ ప్రశ్నించడంతో ఒక్కసారి బరస్ట్ అయ్యాడు సునీల్.సునీల్ ఏడుస్తూ చెప్పిన విషయాలు సావధానంగా విన్నాడు ఇన్స్పెక్టర్.‘‘ఓకే... ఓకే... మీరు కంగారుపడొద్దు. ఇంకా టైముంది కదా... ’’ అంటూ సునీల్‌ను సముదాయిస్తూ అతడికి వచ్చిన ఎస్సెమ్మెస్‌ను పరిశీలించాడు.సునీల్ భార్య, చెల్లెళ్ల ఫోటోలను డేటింగ్ యాప్‌లో ఉంచి, అతడి ఫోన్ నెంబర్ కూడా పోస్ట్ చేస్తామని, అడిగిన డబ్బు ఇవ్వకపోతే రెండు గంటల్లో ఆన్లైన్లో ఫోటోలు ప్రత్యక్షమవుతాయని ఆ ఎస్సెమ్మెస్ సారాంశం. టెక్స్ట్ కింద అసభ్యంగా మార్ఫింగ్ చేసిన అతని భార్య ఫోటోను పంపారు.