‘‘హాయ్... ఏంటీ నిన్న టచ్‌లో లేవు... ఎటెళ్లావు?’’‘‘నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేశా...’’‘‘అవునా... ఏం చేశారు...’’‘‘అబ్బా... ఆశ... అదేంటో గానీ అతడు ముద్దు పెట్టినా, ముట్టుకున్నా ఏదోలా ఉంటుంది...’’ఫేస్బుక్లో సాగుతున్న చాటింగ్ మున్నీని ఎగ్జయిట్ చేస్తోంది.రష్మీ తనను రెచ్చగొడుతోంది. ఫేస్బుక్లో కొన్ని సెక్సీ ఫోటోలు కూడా పెట్టింది.చాటింగ్ కొనసాగుతుండగానే ‘మున్నీ’ అంటూ తల్లి పిలవడంతో ‘బై.. సీ యూ...’’ అంటూ గబగబా టైప్ చేసి లాగౌట్ అయ్యింది.‘‘ఏమండీ... మున్నీ వారం రోజులుగా డల్‌గా ఉంటోంది. రెండు రోజుల నుంచీ కాలేజీకి కూడా వెళ్లడం లేదు...’’‘‘అదేంటి రాజేశ్వరీ... జ్వరంగానీ వచ్చిందా...’’‘‘ అస్తమానం ఫేస్బుక్, వాట్సాప్‌లో చాటింగ్ చేసే మున్నీ ఫోన్ రింగ్ వింటేనే ఉలిక్కిపడుతోంది...’’ఆఫీసుకు వెళ్లబోతున్న అనిల్ భార్య చెప్పిన విషయం విని వెంటనే మున్నీ బెడ్రూమ్లోకి వెళ్లాడు. అతడి వెనకే వెళ్లింది రాజేశ్వరి.బెడ్ మీద మునగదీసుకుని పడుకున్న కూతురి పక్కనే కూర్చుని నుదుటిపై చేయి వేసి చూస్తూ ‘‘మున్నీ ఏమైందమ్మా...’’ లాలనగా అడిగాడు.
‘‘ఏం లేదు డాడీ... ఐయామ్ ఫైన్’’ అంటూ అటువైపు తిరిగి పడుకుంది.చేసేదేం లేక గది బయటకు వచ్చాడు అనిల్. భర్తను అనుసరించింది రాజేశ్వరి.‘‘కాలేజీలో ఏమైనా గొడవ జరిగిందా? అసలే ఇంటర్ సెకండియర్‌లో ఉంది. అయినా, కాలేజీ వాళ్లు ఏదైనా సమస్య ఉంటే వెంటనే చెబుతారే! అసలేమైందో నువ్వే బుజ్జగించి తెలుసుకో. వీలైతే ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టు...’’ అంటూ ఆఫీసుకు బయల్దేరాడు అనిల్.అనిల్, రాజేశ్వరి ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వారి ఒక్కగానొక్క కూతురు మున్నీ. ఆల్మోస్ట్ ఒకేసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు.
సాయంత్రం ఒకరి తర్వాత ఒకరు ఇంటికి చేరుకుంటారు.గత కొన్ని రోజులుగా మున్నీ ప్రవర్తన గమనిస్తున్న రాజేశ్వరిలో ఆందోళన మొదలైంది.గంట తర్వాత మున్నీ గదిలోకి వెళ్లి నెమ్మదిగా కుమార్తె భుజంపై చెయ్యి వేసి ‘‘ఏమైందమ్మా... ఎందుకంత దిగులుగా ఉన్నావు’’ అంటూ దగ్గరకు తీసుకుంది.అప్పటిదాకా తనలో తానే కుమిలిపోతున్న మున్నీ ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ తన బాధను తల్లితో షేర్ చేసుకుంది.